ఏపీపై తుపాను పడగ.. నేటి సాయంత్రానికి బలపడే అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను ప్రభావం కనబడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో నేటి సాయంత్రానికి ఇది తుపానుగా మారే మారుతుందని చెప్పారు. దీని కారణంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తుపాను ప్రభాంతో ఇది 18, 20వ తేదీల్లో ఈశాన్య బంగాళాఖాతం దిశగా ప్రయాణం చేస్తోందని అభిప్రాయపడుతున్నారు. తుపాను కారరణంగా సముద్ర తీర ప్రాంతంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున రాబోయే 3 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు కూడా అప్రమత్తంగా ఉండి పంటను కాపాడుకోవాలని సూచించారు.