LPG cylinder price reduced by Rs 91.50; check rates in metro cities
mictv telugu

సామాన్యూలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. నేటి నుంచే అమలు

September 1, 2022

సామాన్యులకు భారంగా మారిన గ్యాస్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పతనం కావడంతో.. దేశీయ చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన ధరల ప్రకారం.. నేటి నుంచి 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటును రూ.91.5 తగ్గించాయి. ఇవాళ్టి నుంచే ఆ ధరలు అమల్లోకి రానున్నాయి..

తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్‌కు రూ.1885 చెల్లించాలి. గతంలో దీని ధర రూ.1976.50గా ఉండేది.వాణిజ్య సిలిండర్ ధర తగ్గడం ఇది వరుసగా ఐదవసారి. మే నెలలో రికార్డు స్థాయిలో రూ.2354కి చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ.2099.5కి చేరింది. వరంగల్‌లో 2141.50.గా ఉంది. ఇక ఏపీలోని విజయవాడలో రూ.2034, విశాఖపట్టణంలో రూ.1953కి చేరింది.
14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చివరకు జులై 6న మాత్రమే రూ.50 పెరిగింది. ఆ తర్వాత నుంచి పెరగలేదు.