LPG cylinder price update: Price of commercial cylinder slashed by ₹115.5. Check latest rates
mictv telugu

తగ్గిన గ్యాస్ సిలెండర్ ధర.. నేటి నుంచే అమల్లోకి..

November 1, 2022

కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త. మంగళవారం నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు మంగళవారం ప్రకటించాయి. నవంబరు 1వ తేదీ నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.115.50 తగ్గింది. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో అల్లాడుతున్న ప్రజలకు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు ఉపశమనంగా మారింది. తగ్గిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు తగ్గడంతో ఈ మార్పు చేసినట్లు వెల్లడించాయి.

అయితే డొమెస్టిక్ వంటగ్యాస్(14.2 కేజీల సిలిండర్) రేట్లలో ఎలాంటి మార్పు లేదు. జూలై నుంచి 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రేటు నిలకడగానే ఉంది. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం తగ్గుతూ వస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,885 నుంచి రూ. 1,744కి తగ్గించారు. డొమెస్టిక్ ఎల్పీజీ ధర 14.2 కిలోల సిలిండర్‌ ధరను రూ.1,053గా యథాతథంగా ఉంచారు.19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు కోల్‌కతాలో రూ.1846, ముంబైలో రూ.1696, చెన్నైలో రూ.1893గా ఉంది.