ఇసుక గొడవపై హైకోర్టుకెక్కిన ఎల్ అండ్ టీ - MicTv.in - Telugu News
mictv telugu

ఇసుక గొడవపై హైకోర్టుకెక్కిన ఎల్ అండ్ టీ

October 25, 2019

L&T to the High Court on the sand quarrel 

ఎల్ అండ్ టీ సంస్థ ఇసుక తరలింపు వ్యవహారంపై ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. అమరావతిలోని ఎల్ అండ్ టీ స్టాక్ పాయింట్ నుంచి ఇసుక తరలింపును సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుకను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం జారీ చేసిన మెమోలను నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఎల్ అండ్ టీ స్టాక్ యార్డులో ఎంత ఇసుక ఉందో కంపెనీ ప్రతినిధుల సమక్షంలో లెక్కించాలని సూచించింది. 

ఇదిలాఉండగా ప్రభుత్వ వాదన వేరేలా ఉంది. ఏపీలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఇప్పుడు మాత్రమే ఇబ్బందులు ఉంటాయని, భవిష్యత్తులో సరఫరా సాగుతుందని ప్రభుత్వం చెబుతోంది.