ముస్లింలకు హిందూ సన్యాసిని ఇఫ్తార్ విందు - MicTv.in - Telugu News
mictv telugu

ముస్లింలకు హిందూ సన్యాసిని ఇఫ్తార్ విందు

June 11, 2018

పరమత ద్వేషం సమసిపోవాలంటే ఒకరి మతాన్ని ఒకరు తప్పుకుండా గౌరవించాలి. అప్పుడే మనుషుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది అనటానికి ఈ ఉదంతం సాక్షంగా నిలుస్తోంది. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఓ సన్యాసిని శివాలయంలో ముస్లిం సోదరలకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది.Lucknow: Mankameshwar Mandir hosts first roza iftar on ghats famous for Gomti aartiలక్నోలోని అతి ప్రాచీనమైన  శివాలయం మన్‌కామేశ్వర్ ఆలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఆమె ఇఫ్తార్ విందు ఇవ్వడం ఇదే తొలిసారి. గోమతీ నది ఒడ్డున జరిగిన ఈ కార్యక్రమానికి షియా, సున్నీ వర్గాలకు చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున హాజరై విందులో పాల్గొన్నారు.శివాలయానికి చెందిన ముగ్గురు వంటగాళ్లు ఇఫ్తార్ విందు కోసం ఉదయం నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు.