మొదటిరోజే మొరాయించింది.. - MicTv.in - Telugu News
mictv telugu

మొదటిరోజే మొరాయించింది..

September 6, 2017

ఆదిలోనే హంసపాదు అంటే ఇదే. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో బుధవారం అధికారికంగా ప్రారంభించిన మెట్రో రైలు సర్వీసుకు ఆటంకం ఎదురైంది. తొలి మెట్రో రైలు అలా పట్టాలపైకి చేరగానే సమస్య మొదలైంది. అలంబాగ్‌ సమీపంలో ఈ రైలు సాంకేతిక కారణంతో ఆగిపోయింది. బోగీల్లో ఏసీలు, లైట్లు మొరాయించాయి. తలుపులు కూడా తెరుచుకోలేదు. దీంతో 100 మందికి పైగా ప్రయాణికులు రెండు గంటల పాటు రైల్లోనే మగ్గిపోయారు. ఈ రైలు ఛార్‌బాగ్‌ నుంచి ట్రాన్స్‌పోర్ట్‌ నగర్‌ వెళ్తూ ఉన్నట్టుండి ఆగిపోయింది. ట్రాక్షన్ పంప్ లో సమస్య వల్ల ఎమర్జెన్సీ బ్రేకులు పడ్డాయి. డ్రైవర్ నుంచి  సమాచారమందుకున్న మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. రైలు ఎమర్జెన్సీ ద్వారా ప్రయాణికులను దించేసి మరమ్మతులు చేపట్టారు. మూడు గంటల పాటు మెట్రో సేవలు నిలిచిపోయాయి.