కారు ఆపలేదని కాల్చి‌ చంపేశాడు.. కానిస్టేబుల్ నిర్వాకం   - MicTv.in - Telugu News
mictv telugu

కారు ఆపలేదని కాల్చి‌ చంపేశాడు.. కానిస్టేబుల్ నిర్వాకం  

September 29, 2018

రక్షణగా నిలవాల్సిన కొందరు పోలీసులు రక్షసుల్లా మారుతున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే పోలీసులే దాడులకు తెగబడుతున్నారు. కారు ఆపలేదని పోలీసు కానిస్టేబుల్ ఓ వ్యక్తి కాల్చిచంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆపిల్ కంపెనీలో ఏరియా మేనేజర్‌గా పని చేస్తున్న వివేక్ తివారీ శుక్రవారం ఆఫీస్‌లో పని ముగించుకుని కారులో ఇంటికి వెళ్తున్నాడు.  ఆ సమయంలో అటువైపు వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు వివేక్ కారును ఆపారు. కానీ వారిని వివేక్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడు. దీంతో ఓ కానిస్టేబుల్ తన గన్ తీసి వివేక్‌ను కాల్చి చంపేశాడు.Lucknow murder case LIVE : Autopsy report CONFIRMS Vivek was shot in head by copదీనిపై లక్నో డీఎస్పీ స్పందిస్తూ.. ‘వివేక్‌ కారును పోలీసులు అపారు. ఆ సమయంలో అతను ఆగకుండా వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన కానిస్టేబుల్ అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో కారు డివైడర్‌కు ఢీకొని, అతనికి  తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతణ్ణి ఆస్పత్రికి తరలించాం. కానీ అప్పటి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొనారు’ అని తెలిపారు. కాగా పోస్టుమార్టం రిపోర్టులో కానిస్టేబుల్ తప్పు ఉన్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. కానీ వివేక్ భార్య కల్పన మాత్రం ‘ నా భర్తను పోలీసులే కాల్చి చంపారు. వాళ్లకు నా భర్తను కాల్చే హక్క ఎవరిచ్చారు. యూపీ సీఎం ఇక్కడికి వచ్చి, నాకు జవాబు చెప్పాలి’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.