Lucknow to be renamed as Laxmanpuri soon? Yogi Adityanath's TWEET Viral
mictv telugu

లక్నోను లఖన్‌పూర్‌గా మార్చనున్న యోగి సర్కార్!

May 17, 2022

Lucknow to be renamed as Laxmanpuri soon? Yogi Adityanath's TWEET Viral

యూపీలోని ఇతర ప్రాంతాల పేర్లను మార్చేసిన యోగి సర్కార్.. తాజాగా ఆ రాష్ట్ర రాజ‌ధాని ల‌క్నో న‌గ‌రం పేరును కూడా మార్చేలా ఉంది. సోమవారం సాయంత్రం ట్విట్టర్‌లో యోగి ఆదిత్యనాథ్ చేసిన ట్వీట్ దీనికి మరింత బలం చేకూరుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ సీఎం యోగి ‘‘ లక్నోలోని శేషావతార్ లార్డ్ లక్ష్మణ్ జీ పవిత్ర నగరానికి స్వాగతం ’’ అంటూ ట్వీట్ చేశారు. అమౌసీ విమానాశ్రయంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతున్నప్పుడు తీసిన చిత్రాన్ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా ల‌క్నో పేరు మార్పు ఖాయమ‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.

గ‌తంలో లక్నో పేరును లఖన్‌పురి, లక్ష్మణపురి, లఖన్‌పూర్‌గా మార్చాలనే డిమాండ్ చాలా సార్లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో సీఎం ట్వీట్ తో చ‌ర్చ మ‌ళ్లీ మొద‌లైంది. యోగి సర్కార్ గతంలో అలహాబాద్ పేరును ప్రయోగ్‌రాజ్‌గా, ఫైజాబాద్ పేరును అయోధ్యగా మార్చింది. కాగా, లక్నోకు కానీ, మరే ఇతర సిటీకి గానీ పేరు మార్చే విషయం తమకు తెలియదని అధికారులు చెబుతున్నారు.