కరోనా భయం..కూతురిని ఎత్తుకుని మహిళ 900 కి.మీ ప్రయాణం! - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా భయం..కూతురిని ఎత్తుకుని మహిళ 900 కి.మీ ప్రయాణం!

May 10, 2020

Lucknow woman travels 900 km to save daughter from Covid-19

కరోనా మహమ్మారి ప్రజలను భయపెడుతోంది. దేశంలోని పలు నగరాల్లో జీవిస్తున్న వలస కార్మికులు తిరిగి సొంతూళ్లకు పయనమవుతున్నారు. సరైన ప్రయాణ సౌకర్యాలు లేనప్పటికీ వారి ప్రయాణం ఆగడం లేదు. కొందరు ఏకంగా కాలినడకన వెళ్తున్నారు. తాజాగా రుక్సానా బానో అనే మహిళ తన కూతురిని ఎత్తుకుని 900 కిలోమీటర్ల ప్రయాణించి సొంత గ్రామానికి చేరుకుంది. 

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందిన రుక్సానా బానో తన భర్త అఖ్విబ్‌తో కలిసి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంటోంది. వీరికి నర్గీస్ (3)‌ అనే కూతురు ఉంది. అఖ్విబ్‌ ఒక హోటల్‌లో పని చేస్తున్నాడు. రుక్సానా ఇళ్లలో పనిమనిషిగా పని చేస్తుంది. లాక్ డౌన్ విధించడంతో వీరి కుటుంబం ఇండోర్‌లోనే ఉండిపోయింది. ఇక్కడే ఉంటే తన కూతురుకి కూడా కరోనా సోకుతుందని రుక్సానా భయపడింది. స్వగ్రామానికి వెళదామని అఖ్విబ్ ను రుక్సానా కోరింది. కానీ, అతడు ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి అనుకుంది.‌ ఇండోర్ లో ఉంటున్న ఆమె బంధువులు కొందరు అమేథీకి వెళ్తున్నారని తెలుసుకుంది. వాళ్లతో పాటు తన కూతురుని తీసుకుని బయలుదేరింది. మధ్య మధ్యలో నిత్యావసరాలను తీసుకుని వెళ్తున్న లారీలు, ట్రక్కుల ఆపి లిఫ్ట్ తీసుకుంది. ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకుంది.