నడిరోడ్డులో ‘సల్మాన్ ఖాన్’ బిత్తిరి పని.. జైల్లోకి నెట్టేశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

నడిరోడ్డులో ‘సల్మాన్ ఖాన్’ బిత్తిరి పని.. జైల్లోకి నెట్టేశారు..

May 9, 2022

టిక్‌టాక్, ఇన్‌స్టా రీల్స్ వంచి సోషల్ మీడియా యాప్‌లతో సినిమా హీరోలను ఇమిటేట్ చేస్తూ.. భారీ సంఖ్యలో ఫాలోవర్స్ పెంచుకుంటున్నారు కొంతమంది. వారిలాగే లైక్, వ్యూస్ సంపాదిద్దామని నడిరోడ్డుపై ఓ తింగరి పని చేసి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు ఓ మెగా హీరో అభిమాని. యూపీకి చెందిన ఆజమ్ అన్సారీ.. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు బీభత్సమైన ఫ్యాన్. అచ్చం సల్మాన్ లాగా బాడీ పెంచి, అతడిలా డైలాగులు చెబుతూ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యాడు.

ఎప్పటిలాగే లైకుల కోసం ఆదివారం ఠాకూర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్లాక్ టవర్‌ వద్ద వీడియోలు చేస్తూ కాస్త అతి ప్రదర్శించాడు. అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేస్తూ వెర్రిగా ప్రవర్తించాడు. ఆ సమయంలో అతణ్ని చూసేందుకు జనం గుమిగూడడంతో ఆ రోడ్‌లో వాహనాలంతా ఎక్కడికక్కడ నిలచిపోయాయి. తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు వెంటనే ఎంట్రీ ఇచ్చి.. అందుకు కారణమైన ఈ డూప్ సల్మాన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. పబ్లిక్ ప్లేస్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు అతడిపై సెక్షన్ 151 కింద అరెస్ట్ చేసి జరిమానా కూడా విధించారు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇంతకీ ఈ డూప్ హీరో యూట్యూబ్‌లో ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారో తెలుసా.. 1,67,000 మంది. ఇతని వీడియోలకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.