లూడో గేమ్‌లో లొల్లి.. ఖమ్మంలో దారుణ హత్య - MicTv.in - Telugu News
mictv telugu

లూడో గేమ్‌లో లొల్లి.. ఖమ్మంలో దారుణ హత్య

June 30, 2020

Ludo game fight in khammam

లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికి కరోనా భయంతో మెజారిటీ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. దీంతో కాలక్షేపం కోసం లూడో మొదలగు మొబైల్ గేమ్స్ అవుతున్నారు. అయితే, వాటిలో తలెత్తే చిన్న చిన్న గొడవలు చినికి చినికి గాలి వానలా తయారవుతున్నాయి. కొన్ని సార్లు ప్రాణలు తీసుకునే దాకా వెళ్తున్నాయి. తాజాగా ఇలాంటి దారుణం ఒకటి ఖమ్మం జిల్లాలోని బోనకల్‌లో జరిగింది.

బోనకల్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి 9:30 గంటలకు వట్టికొండ నాగేశ్వరావు, కోలా గోపి అనే ఇద్దరు యువకులు పక్కపక్కనే కూర్చొని మద్యం తాగుతూ మొబైల్ ఫోన్ లో లూడో గేమ్ ఆడుతున్నారు. తొలుత రూ.50 బెట్టింగ్ పెట్టి ఆడారు. వరుసగా రెండుసార్లు నాగేశ్వరరావు గెలిచాడు. దీంతో గోపి అసహనానికి గురయ్యాడు. ఈసారి బెట్టింగ్ రూ.500 పెడదామని గోపి అనగానే.. నీకంత దమ్ములేదంటూ నాగేశ్వరరావు హేళన చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన గోపి పక్కనే ఉన్న మద్యం సీసా పగలగొట్టి నాగేశ్వరావు మెడ, పొత్తికడుపులో పొడిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నాగేశ్వరరావును ఆస్పత్రికి తరలించారు. బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.