మెట్రో ప్రయాణం మరింత సులభం.. కేంద్రం గుడ్ న్యూస్
మెట్రో రైలుతో ప్రయాణం నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించింది. ఇప్పటికే చాలా మంది సులభంగా గమ్యం చేరేందుకు మెట్రో రైలునే ఎంచుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు మెట్రో చాలా ఉపయోగకపడే విధంగా ఉంది. అయితే ప్రయాణం ఏమో కానీ.. లగేజ్ తీసుకెళ్లడం ఇప్పటి వరకు కొంత ఇబ్బందిగా ఉండేది. షరతుల వల్ల ఎక్కువగా లగేజ్ తీసుకెళ్లే అవకాశం ఉండేది కాదు. కానీ కేంద్రం తాజా నిర్ణయంతో కాస్త ఊరట లభించింది.
లగేజ్ బరువు పరిమితి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొని ప్రయాణికులకు శుభవార్తను వినిపించింది. ఇకపై 25 కిలోల వరకు లగేజ్ తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. లగేజ్ తీసుకెళ్లడంలో చాలా మంది ఇబ్బంది పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు వరకు 15 కిలోల వరకే తీసుకెళ్లేందుకు అనుమతి ఉండేది. కానీ దాన్ని మరో 10 కిలోలకు పెంచింది. తాజా నిర్ణయం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.