Lunar Eclipse 2022: clipse will begin at 5.40 pm and end at 7.26 pm in Hyderabad
mictv telugu

రోజంతా కాదు.. గంట 46 నిమిషాల పాటే చంద్రగ్రహణం

November 8, 2022

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. ఈరోజు ఏర్పడనునున చంద్రగ్రహణం ఈ ఏడాదిలో రెండవది.. చివరిది కూడా. ఈ సారి చంద్రగ్రహణం మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు ముగుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే హైదరాబాద్‌లో మాత్రం సాయంత్రం 5.40కు ప్రారంభమై 7.26 గంటలకు ముగుస్తుంది. గంట 46 నిమిషాల పాటు గ్రహణం ఉంటుందని జి.పి.బిర్లా ఆర్కియలాజికల్‌ ఆస్ట్రోనామికల్‌ అండ్‌ సైంటిఫిక్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌(జీపీబీఏఏఎస్‌ఆర్‌ఐ) ఒక ప్రకటనలో పేర్కొంది. చంద్రగ్రహణం పాక్షికమైనదే అయినా.. దీని ప్రభావం మనపై ఉంటుంది అంటున్నారు. ఈ చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర ఫసిఫిక్‌, హిందుమహా సముద్ర ప్రాంతాల్లో కనిపించనుండగా.. ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మళ్లీ 2025 మార్చి 14న ఏర్పడనుంది.

ఇక చంద్రగ్రహణం సందర్భంగా నేడు రాష్ట్రంలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని 8.15 గంటలకు మూసివేశారు. గ్రహణం ముగిసిన తరవాత తిరిగి రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ పూజలు నిర్వహించనునునారు. ఇక ఏపీలోని తిరుమలలో కూడా శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు టీటీడీ అధికారులు. గ్రహణం విడిచాక, ఆలయ శుద్ధి అనంతరం యథావిధిగా పూజలు నిర్వహిస్తామని చెప్పారు.