డ్యూటీకి రమ్మంటే.. ప్యాంటు వేసుకోకుండానే వచ్చేశాడు!  - MicTv.in - Telugu News
mictv telugu

డ్యూటీకి రమ్మంటే.. ప్యాంటు వేసుకోకుండానే వచ్చేశాడు! 

December 16, 2017

డ్యూటీ అయిపోయిన కానిస్టేబుల్‌ను మళ్ళీ స్టేషన్‌కు రమ్మన్న కర్మానికి లుంగీ, బనియన్ మీదే ఠాణాకు వచ్చేసి స్టేషన్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.  కరీంనగర్ రెండో పట్టణ ఠాణాలో జరిగింది ఈ విచిత్ర ఘటన. మెడికల్ లీగల్, శవ పంచనామా విధులు నిర్వర్తించుకున్న తిరుపతి అనే కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి హాయిగా రిలాక్సయ్యాడు. ఇంతోలోనే ఎస్సై పాషా ఫోన్ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించాడు.


డాక్టర్లకు, పోలీసుల డ్యూటీకి సమయం, సందర్భాలు ప్రత్యకంగా వుండవనుకోలేదేమే ఈ కానిస్టేబుల్ తిరుపతి. ‘ అబ్బా.. ఇందాక అక్కడేకదా దొబ్బించుకు వచ్చాను.. ఇంట్లో కాస్త పెళ్ళాం, పిల్లలతో సరదాగా గడుపదామనుకుంటే మళ్ళీ ఫోను, ఛ.. నా బతుకంతా ముద్దూ ముచ్చట్లు లేకుండా ఈ డ్యూటీలకే సరిపోతుందేమో ’ అనుకున్నట్టున్నాడు. ఆ అనుకోవటంలో యూనిఫాం వేసుకోవడం మర్చిపోయి అలాగే లుంగీ, బనియను మీదే స్టేషన్‌కు చేరుకున్నాడు.

ఆ హడావుడిలో లుంగీ కూడా వూడిపోవడంతో అక్కడున్న సిబ్బంది లుంగీ కట్టి వెనక్కి పంపించారు. కాగా రెండో ఠాణాలో కేసుల గందరగోళం నెలకొనడం వల్లే అతణ్ణి పిలవాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు.