తెలుగులోనూ ‘లస్ట్ స్టోరీస్’.. అమలాపాల్‌తో - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగులోనూ ‘లస్ట్ స్టోరీస్’.. అమలాపాల్‌తో

October 9, 2019

Lust stories in telugu.

లస్ట్ స్టోరీస్.. వయసొచ్చిన వాళ్లకు పరిచయం అక్కర్లేని వెబ్ సెరీస్. శ్రుతిమించిన శృంగారాన్ని సెన్సార్ లేకుండా చూపించే ఈ కథలను తెలుగులోనూ రీమేక్ చేయబోతున్నారు. ‘ఆమె’ రీమేక్ సినిమాలో నగ్నంగా నటించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న అమలాపాల్ ఇందులో నటిస్తోంది. ‘ఆమె’ చిత్రంలో ఆమె చూపించి తెగువకు లస్ట్ స్టోరీస్ దర్శకుల్లో ఒకరైన కరణ్ జోహార్ ఫిదా అయ్యాడు. ఆమెను తెగ పొడిగేశాడు. దీంతో మరో నిర్మాత రోనీ స్రూవాలా.. అమలాపాల్‌ను తెలుగు వెర్షన్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సెట్లపైకి వెళ్తే టాలీవుడ్ దర్శకురాలు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తారని సమాచారం! సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి కూడా తీస్తారని అంటున్నారు. హిందీ లస్ట్ స్టోరీస్ లో కొన్ని భాగాలకు దర్శకురాలు జోయా డైరెక్ట్ చేసింది.