గతుకుల రోడ్డుపై లగ్జరీకారు.. ముక్కుతూ మూలుగుతూ..
Never get richer than the Government. pic.twitter.com/rpqoUKvjGl
— Godman Chikna (@Madan_Chikna) September 4, 2019
లగ్జరీ కారు కొనడం చాలా మంది ధనవంతులు గొప్ప విషయంగా భావిస్తారు. అవి ఎంత లగ్జరీగా ఉంటాయో అప్పుడప్పుడు అంతే ఇబ్బందులు పెడుతుంటాయి. సాధారణ రోడ్లపై వేగంగా దూసుకెళ్లే కారు గతుకుల రోడ్లపైకి వెళ్లాల్సి వస్తే మాత్రం ఆ నరకం గురించి చెప్పాల్సిన అవసరమేలేదు. తాజాగా అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాముకంటే మెల్లగా ప్రయాణిస్తూ మన దేశంలో రోడ్ల పరిస్థితికి అద్ధం పట్టింది.
గాడ్‌మ్యాన్ చింకా అనే ట్విటర్ యూజర్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ‘ ఎప్పుడూ ప్రభుత్వం కంటే ధనవంతులు కాకూడదు’ అంటూ ట్వీట్ చేశాడు. అందులో కోటి రూపాయల విలువ చేసే హై ఎండ్ చెవర్‌లెట్ కారు ముక్కుతూ మూలుగుతూ నడవటం కనిపించింది. మామూలు రోడ్లపై రయ్య్ మంటూ దూసుకెళ్లే కారు తాబేలులా కదలాల్సి వచ్చింది. గతుకులు లేని ప్రాంతాలను చూసుకుంటూ వెళ్తుంటే దాని వెనక వచ్చే వాహనాలన్నీ నిదానంగా వస్తున్నాయి. అయితే మిగితా బైకులు, ఆటోలు, ట్రక్కులు మాత్రం మామూలుగా వెళ్లిపోతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెట్టేశారు. దీనికి బదులు ఆటో లేదా ట్రాక్టర్ కొనుక్కుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మన దేశంలో రోడ్ల పరిస్థితికి ఇది మంచి ఉదాహరణ అంటూ మరికొంత మంది పేర్కొంటున్నారు.