చేతి గడియారానికి రూ. 222 కోట్లు.. ఓ మంచిపని కోసం..  - MicTv.in - Telugu News
mictv telugu

చేతి గడియారానికి రూ. 222 కోట్లు.. ఓ మంచిపని కోసం.. 

November 12, 2019

చేతి గడియారాల్లో ఖరీదైనవి ఉంటాయి. రాడో లాంటి కంపెనీలు కస్టమర్ల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని నానా వెరైటీలు తీసుకొస్తుంటాయి. అయితే  ‘పాటక్‌ ఫిలిప్పీ గ్రాండ్‌ మాస్టర్‌ చిమ్‌’ రకం గడియారాలది మరో కోవ. వాటిని కొనడం సామాన్య కుబేరులకు సాధ్యం కాదు. కుబేరుల్లోనూ హైలెవెల్ వాళ్లకే అవి అందుబాటులోఉంటాయి. అలాంటి వాచీనీ ఓ ఆసామి ఓ మంచి పనికోసం ఉచితంగా ఇవ్వగా.. క్రిస్టీస్ సంస్థ వేలం వేసింది. 

Luxury watch.

జెనీవాలో జరిగిన వేలంలో దీన్ని ఓ వ్యక్తి రూ.222 కోట్లకు కొన్నాడు. ఊహించిన ధరకంటే పన్నెండు రెట్లు ఎక్కువ ధర పలికింది. వేలంలో ఒక రిస్ట్ వాచీ ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. ఈ వాచీ తయారీ సంక్లిష్టంగా ఉండడమే దీనికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ మోడల్ వాచీని ఒక్కదాన్నే తయారు చేశారు. ఈ విషయాన్ని డయల్ పైనే ద ఓన్లీ వన్ అని రాశారు కూడా.  దీని డయల్‌ను నలుపు లేదా గులాబీ రంగుల్లోకి మార్చుకోవచ్చు. దీని వేలం ద్వారా వచ్చిన డబ్బును కండర బలహీనతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడానికి వెచ్చించనున్నారు. కాగా, 2017లో హాలివుడ్‌ నటుడు పాల్‌ న్యూమన్‌ వేలం వేసి డెటోనా చేతి గడియారం రూ. 124 కోట్లకు అమ్ముడుబోయింది.