రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం.. - MicTv.in - Telugu News
mictv telugu

రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం..

May 20, 2019

lyricist chandra bose mother dead heart attack monday morning at hyderabad.

టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం చంద్రబోస్ మాతృమూర్తి మదనమ్మ హైదరాబాద్‌లోని నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ రోజు సాయంత్రం వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని చల్లగిరి గ్రామంలో మదనమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

సినీగేయ రచయితగా తెలుగులో మంచి పేరు సంపాదించుకున్న చంద్రబోస్.. అనేక పాటలు రాశారు. 1995లో తాజ్ మహల్ సినిమాతో సినీగేయ రచయితగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చంద్రబోస్.. అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక పాటలు రాసి, ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.