సూర్యుడికే నిప్పును అప్పిస్తా.. - MicTv.in - Telugu News
mictv telugu

సూర్యుడికే నిప్పును అప్పిస్తా..

September 16, 2017


జూనియర్ ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ మూవీలోని ‘స్వింగ్ జరా’ ఐటం సాంగ్ లోని పూర్తి లిరిక్స్ ను శనివారం విడుదల చేశారు. ఎన్టీఆర్‌-తమన్నాలపై చిత్రీకరించిన ఈ పాటలో ఇద్దరూ భలే స్టెప్పులేసి అదరగొట్టారు. ‘పుట్టుకతోనే నేను ఓ నిప్పుతో పుట్టాను.. అడిగాడో సూర్యుడికే అ..అ..అప్పిస్తాను’ పాడుతూ కనిపించాడు ఎన్టీఆర్. యూట్యూబ్ లో ఇప్పటికే ఈ పాట ట్రెండింగ్ మారింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, నివేదా థామస్ కథానాయికలు.  యు/ఎ సర్టిఫికెట్‌ పొందిన ఈ మూవీ సెప్టెంబరు 21న విడుదల కాబోతోంది.