టాలీవుడ్లో తన సంగీతంతో సినీ ప్రియులను, యువతను ఊరూత్రలు ఉగిస్తూ, వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు తమన్. ‘కిక్’ సినిమాతో సంగీత దర్శకుడిగా చిత్రసీమలో అడుగుపెట్టిన తమన్.. తొలిచిత్రం నుంచి తాజాగా వచ్చిన ‘సర్కారు వారి పాట’ వరకు కొత్త కొత్త ట్యూన్స్ క్రియేట్ చేస్తూ, సినిమాకు బ్యాక్ బోన్ల కొనసాగుతున్నారు.
తాజాగా పరశురామ్ దర్శకత్వంలో మే 12న విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘మ మ మహేష సాంగ్’ కాపీ ట్యూన్ అంటూ నెటిజన్స్ తమన్ తీరుని విమర్శిస్తున్నారు. ఈ వార్తలపై తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నిజంగానే నాకు ఆ విషయం తెలియదు. ఒక వేళ అలాంటిదేమైనా ఉండుంటే నా టీమ్ సభ్యులు చెప్పేవాళ్లు. మా టీమ్‌లో 14 మంది మెంబర్స్ ఉన్నారు. లిరిసిస్ట్, ప్రోగ్రామర్స్ ఇలా ఎవరైనా అది రిపీటెడ్ ట్యూన్ అని చెప్పేవాళ్లు. సెర్చింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. వాటిలో అయినా మాకు తెలిసేది. నిజంగానే మ మ మహేష పాటకు ట్యూన్ కంపోజ్ చేసే సమయంలో అలాంటి ఆలోచనే మాకు రాలేదు. చివరకు ప్రజలు మ మ మహేష పాట మరో పాటకు దగ్గరగా ఉందని చెప్పారు. అప్పుడే మాకు కూడా అర్థమైంది. ఆ ఫ్లోతో ముందుకెళ్లిపోయాం’’ అని ఆయన అన్నారు.