మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్షుడు, సినీ హీరో మంచు విష్ణుతో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సమావేశమయ్యారు. ఈ ఆగస్ట్ 1వ తేదీ నుంచి టాలీవుడ్లో షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించుకునేందుకు నిర్మాతలు ప్రత్యేకంగా చర్చలు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. ప్రధానంగా బడ్జెట్ కంట్రోల్ విషయంలో అలాగే, హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకునే విషయంలో గిల్డ్ సమావేశంలో నిర్మాతలు జరిపిన చర్చలు కొంతవరకు సఫలమయ్యాయి.
Started meeting our TFI producers on behalf of MAA, requesting them to hire mostly MAA members and also to encourage newcomers to become a part of the MAA family. pic.twitter.com/1AjvqU436J
— Vishnu Manchu (@iVishnuManchu) August 4, 2022
ఈ క్రమంలో గురువారం ఉదయం మంచు విష్ణు కార్యాలయానికి వెళ్లిన దిల్‌రాజు ఆయనతో కొద్దిసేపు సమావేశమయ్యారు. తమ సినిమాల్లో ‘మా’ సభ్యులకు ఎక్కువగా అవకాశాలు కల్పించాలని, అలాగే, కొత్తవారు ‘మా’లో భాగమయ్యేలా ప్రోత్సహించాలని దిల్ రాజుని విష్ణు కోరారు. ఈ మేరకు ‘మా’ సంక్షేమ కమిటీ వినతి పత్రాన్ని దిల్‌రాజుకు అందించారు. ‘మా’ సభ్యులకు అవకాశాలు కల్పించాలని కోరుతూ టాలీవుడ్ నిర్మాతలను విష్ణు ఇకపై కలవనున్నారు. ఇందులో భాగంగా దిల్‌రాజుతో భేటీ అయ్యారు.
”మా తరఫున మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మాతలను కలవడం ప్రారంభించాం. ‘మా’లో సభ్యులకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని, సినిమాల్లో ‘మా’ సభ్యులను ఎక్కువ మందిని తీసుకోవాలని, ‘మా’ కుటుంబంలో కొత్త వారు భాగమయ్యేలా ప్రోత్సహించాలని రిక్వెస్ట్ చేశాం” అని విష్ణు మంచు ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం అయితే విష్ణు “జిన్నా” మరియు “ఢీ డబుల్ డోస్” చిత్రాలతో బిజీగా ఉండగా దిల్ రాజు చరణ్ శంకర్ తో భారీ సినిమా అలాగే విజయ్ తో “వారసుడు” చిత్రాలతో బిజీగా ఉన్నారు.