'Macharla Constituency' into OTT...when?
mictv telugu

ఓటీటీలోకి ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’..ఎప్పుడంటే?

August 19, 2022

టాలీవుడ్‌లో భారీ హిట్టు కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరోల్లో నితిన్ ఒకరు. ‘భీష్మ’ సినిమా త‌ర్వాత నితిన్ న‌టించిన మూడు సినిమాలు వరుసగా ప్రేక్ష‌కుల‌ను నిరాశపరిచాయి. తాజాగా తెరకెక్కిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా అయిన భారీ హిట్టు కొడుతుందేమోనని నితిన్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూసినప్పటికి ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ సైతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన మరో తాజా సమాచారం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ సినిమాను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ డిజిట‌ల్ హ‌క్కులను ద‌క్కించుకుంది. కాగా, ఈ సినిమా సెప్టెంబ‌ర్ 9 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంటే థియేట‌ర్ విడుద‌ల‌కు నెల రోజులలోపే ఈ సినిమా డిజిట‌ల్‌లో విడుద‌ల‌ అవుతుందన్నమాట. ఇక, ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా క‌నిపించాడు. నితిన్‌కు జోడీగా కృతిశెట్టి, క్యాథెరీన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించారు. ఆదిత్య మూవీస్, ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక, ఈ సినిమాకు ముందు మంచి బ‌జ్ ఏర్ప‌డినా, రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ టెంప్లేట్ అవ‌డంతో ప్రేక్ష‌కుల‌కు రుచించ‌లేదు. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వ‌చ్చినప్పటికి, రెండో రోజు నుండి క‌నీస స్థాయిలో కూడా క‌లెక్ష‌న్‌లు రాలేక‌పోయాయి. ఈ సినిమాకు పోటీగా ‘కార్తికేయ-2’ ఉండ‌టం కూడా పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. ఇక, నితిన్ హీరోగా రాబోయే సినిమాలైనా భారీ హిట్ కొడతాయా? లేక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా మళ్లీ బోల్తాపడతాయా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.