అమెరికాలో పేడ కేకులు.. తినేవేనా అని చూస్తున్న విదేశీయులు   - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో పేడ కేకులు.. తినేవేనా అని చూస్తున్న విదేశీయులు  

November 18, 2019

Made-In-India Cow Dung Cakes Go International

‘ముఖ్య గమనిక.. ఈ కేకులు తినడానికి కాదు, కేవలం మత కార్యక్రమాల కోసమే’ అని ఓ దుకాణం బయట బోర్డు పెట్టింది. ఏంటబ్బా ఆ కేకులు అని అనుకుంటున్నారా. అవే ఆవుపేడ పిడకలు. చిత్రంగా ఉన్నా, ఈ కేకులు అని పిలవబడుతున్న కేకులు మనకు కొత్త అయితే కాదు. మన దేశంలో అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలు వీటి అమ్మకాలను ఎప్పుడో ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేకులు ఇప్పుడు అమెరికాలో కూడా అమ్ముడు అవుతున్నాయి. అమెరికాలోని న్యూజెర్సీలో ఓ దుకాణంలో ఆవుపేడతో చేసిన కేకులు అమ్మకానికి పెట్టారు. దీని ధర ఆన్‌లైన్‌ రేట్ల కన్నా తక్కువగా ఉన్నాయి. పది కేకులు రూ. 214కే  లభ్యం అవుతున్నాయి. అక్కడికి వచ్చిన వినియోగదారులు ఆ ప్యాకెట్ చూసి పేడ కేకులా అని వెనుదిరుగుతున్నారు. 

ఈ పేడ కేకుల ప్యాకెట్‌పై భారత ప్రోడక్ట్‌ అని రాసి ఉంది. దీన్ని ఫొటో తీసిన మహిళ ఆమె సోదరుడు సమర్‌ హలంకర్‌కు పంపింది. దానిని అతను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘ఇంతకీ ఇవి దేశీ ఆవుల పేడతో చేసినవా? లేక విదేశీ ఆవుల పేడతో చేసినవా?’ అని చమత్కరించాడు. అతని పోస్టుపై చాలామంది తమాషాగా స్పందిస్తున్నారు. ‘మీ అనుమానం పోవాలంటే వాటిని నోట్లో వేసుకుని కరకరా నమిలి చూడండి’ అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.