Madhavan's sensational comments on ISRO..Netizens fire
mictv telugu

ఇస్రోపై మాధవన్ సంచలన వ్యాఖ్యలు..నెటిజన్లు ఫైర్

June 25, 2022

ప్రముఖ నటుడు మాధవన్ భారత అంతరిక్ష పరిశోధన రంగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ”ఇస్రో చేపట్టిన అంగారక యాత్రకు పంచాంగం తోడ్పడింది. పంచాంగం చూసి పెట్టిన ముహూర్త బలంతో భారత్ మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించగలిగింది. గ్రహగతులన్నీ పంచాంగంలో నిక్షిప్తమై ఉంటాయి” అని వ్యాఖ్యలు చేశాడు.

మాధవన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. ‘సైన్స్ గురించి తెలియకపోవడం తప్పేమీ కాదు. మాధవన్ చెత్తవాగుడును కట్టిపెట్టాలి. వాస్తవాలు తెలియకుండా మాధవన్ మాట్లాడిన మాటలు వింటుంటే ఓ మూర్ఖుడిలా అనిపించాడు. మాధవన్ ఇకపై అధికారికంగా చాక్లెట్ బాయ్ నుంచి వాట్సాప్ అంకుల్ అయ్యాడు. మాధవన్ మాట్లాడకుండా ఉంటేనే ముద్దొస్తుంటాడు’ అని కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు.

మరోపక్క మాధవన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్.’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాను మాధవన్‌నే స్వయంగా తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజాగా భారత అంతరిక్ష పరిశోధన రంగంపై వ్యాఖ్యలు చేయడం హాట్ టాఫిక్‌గా మారింది.