పవన్ కల్యాణ్‌కు మద్దతుగా మాధవి దీక్ష - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్‌కు మద్దతుగా మాధవి దీక్ష

April 17, 2018

చూస్తోంటే టాలీవుడ్ శ్రీరెడ్డి, పవన్ కల్యాణ్ వర్గాలు అనే రెండు భాగాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన అమ్మాయిలు శ్రీరెడ్డిని ఆశ్రయిస్తుండగా, పవన్ పై అభిమానం పెంచుకున్న అమ్మాయిలు ఆయనకు అండగా నిలుస్తున్నారు. అతనికి మద్దతుగా నటి మాధవీలత బుధవారం ఫిల్మ్ చాంబర్ ఎదుట మౌన దీక్ష చేయనుంది.

‘పవన్ కల్యాణ్ అభిమానులకి, మానవత్వమున్న వారికి, తెలుగు భాషపై ప్రేమ ఉన్న వారికి ఇదే నా ఆహ్వానం. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే ఈ దీక్షకు పొట్టనిండా తిని రండి’ అని ఆమె ఫేస్ బుక్ లో కాసేపటి కింద పోస్ట్ పెట్టింది. శ్రీరెడ్డికి అన్యాయం జరిగి ఉంటే ఆమె రోడ్డెక్కి, టీవీ చానళ్లలో అల్లరి చేయకుండా కోర్టుకు, పోలీస్ స్టేషన్లకు వెళ్లాలని పవన్ కల్యాణ్ సలహా ఇవ్వడం, దీనికి శ్రీరెడ్డి ఘాటుగా స్పందిస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం కోసం నువ్వు కూడా పోలీస్ స్టేషన్ కు, కోర్టు వెళ్లు అని ఎద్దేవా చేయడం తెలిసిందే. దీంతో పవన్ అభి మానులు ఆమెపై వేధింపులకు దిగగా, ఆమె పవన్‌ను బండబూతు తిట్టింది.