రిలీజ్ కు ముందే ఈ సినిమాకు వివాదాలా ? - MicTv.in - Telugu News
mictv telugu

రిలీజ్ కు ముందే ఈ సినిమాకు వివాదాలా ?

July 13, 2017

మధుర్ భండాడ్కర్ ఏ సినిమా చేసినా అది తప్పకుండా మంచి సినిమానే అవుతుందనే నమ్మకుంది ప్రేక్షకుల్లో. అయితే ఇప్పుడు కొత్తగా చేసిన ‘ ఇందూ సర్కార్ ’ సినిమా మీద అప్పుడే వివాదాలు ముసురుకున్నాయి. ఇందిరా గాంధీ హయాంలో అత్యవసర పరిస్థితిపై తీసిన సినిమా అవడంతో వివాదాలు చుట్టుకున్నాయంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమా రిలీజ్ ను వెంటనే ఆపాలని మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ మనవరాలినని చెప్పుకుంటున్న ప్రియాసింగ్ పాల్ హైకోర్టును కోరింది. తన తండ్రి సంజయ్ గాంధీ అని చెప్పుకుంటున్న ప్రియాసింగ్ తన జనన, దత్తత ధృవీకరణ పత్రాలు పట్టుకొని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ కుటుంబం గురించి అభ్యంతరకర సన్నివేశాలున్నట్టు ప్రియాసింగ్ తన పిటిషన్ లో పేర్కొనడం గమనార్హం.

నీల్ నితీష్, సుప్రియా వినోద్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా వివాదాలను తొలగించుకొని తొందరలోనే విడుదల అవ్వాలని కోరుకుంటున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు.