యువతిపై గ్యాంగ్ రేప్.. ఆరు గంటల పాటు నరకం
లాక్‌డౌన్‌లోనూ కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలపై అత్యాచారాలకు తెగబడుతూనే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో అయితే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. వారం రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా 18 ఏళ్ల యువతిని ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె తన సోదరుడితో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఏప్రిల్ 29న రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. సుమారు ఆరు గంటల పాటు ఆమెకు నరకం చూపించారు.
బితూల్ జిల్లాకు చెందిన యువతి తన సోదరుడితో కలిసి పెట్రోల్ తెచ్చుకునేందుకు బైక్ పై వెళ్లింది. తిరిగి వస్తున్న సమయంలో కొంత మంది దుండగులు అడ్డగించారు. ఆమె సోదరుడిని కొట్టి పాడుబడిన బావిలో పడేశారు. ఆ తర్వాత పక్కనే ఉన్న అడవిలోకి లాక్కెళ్లి.. ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు వ్యక్తులు అత్యాాచారానికి పాల్పడ్డారు. దాదాపు అర్ధరాత్రి 2 గంటల వరకు ఆమెపై అత్యాచారం జరిపారు. ఆ తర్వాత అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఇద్దరూ ఇంటికి తిరిగి రాకపోవడంతో స్థానికులు అంతా కలిసి చుట్టుపక్కల గాలించగా.. వీరి ఆచూకీ లభించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఐదుగురిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అరెస్టు అయిన వారిలో ముగ్గురు మైనర్లు ఉండటం విశేషం. కాగా ఇటీవల , దామో జిల్లాలో ఓ ఆరేళ్ల బాలికను తన సొంత గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు కిడ్నాప్ చేసి, అత్యాచారం సంగతి తెలిసిందే.