28 ఏళ్లుగా నిరాహారదీక్ష.. అయోధ్యకు వెళ్లి విరమిస్తానన్న బామ్మ  - MicTv.in - Telugu News
mictv telugu

28 ఏళ్లుగా నిరాహారదీక్ష.. అయోధ్యకు వెళ్లి విరమిస్తానన్న బామ్మ 

August 3, 2020

Madhya Pradesh 82-yr-old woman fasting for past 28 years in Jabalpur for Ram Mandir construction.

అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరగాల్సిందేనని ఆ బామ్మ పంతం పట్టింది. అందుకోసం ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయి మందిరం నిర్మాణం జరగాలి.. తన ఆరాధ్య దేవుడు శ్రీరాముడు ఆ మందిరంలో ప్రతిష్ఠింపబడాలని ఆమె గత 28 ఏండ్లుగా నిరాహార దీక్ష చేస్తోంది. అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించి ప్రసాదం తిన్నాకే తన దీక్షను విరమిస్తానని ఆమె చెబుతోంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ఊర్మిళ చతుర్వేది అనే 82 ఏళ్ల బామ్మ.. 1992లో బాబ్రీ మసీదు ధ్వంసం అనంతరం జరిగిన మత ఘర్షణలతో ఆమె తీవ్ర కలత చెందింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగే వరకు ఆహారం తీసుకోకూడదని నాడు నిర్ణయించుకుంది. అప్పటినుంచి ఎంతో నిష్ఠగా నిరాహార దీక్ష చేస్తూ 28 ఏళ్లు పూర్తి చేసుకుంది. 

ఇన్నేళ్ల కాలంలో ఆమె కేవలం పాలు, పెరుగు, పండ్లు తింటూ జీవించింది. ఎట్టకేలకు ఆమె మనవాంఛ సిద్ధించింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రామ మందిర నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, అయోధ్యలోని భవ్య రామ మందిర నిర్మాణానికి ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయోధ్యలోని రాముడ్ని దర్శించుకుని ఆ ప్రసాదంతో తన నిరాహార దీక్షను విరమిస్తానని ఊర్మిళ చతుర్వేది వెల్లడించింది.