Madhya Pradesh: Academically brilliant Kanhaiya chooses to attend classes wearing a towel
mictv telugu

టవల్‌తోనే కాలేజీకి.. బట్టలంటే మహ చిరాకు మనోడికి

October 20, 2022

ఎక్కడైనా బయటకి వెళ్లాలంటే కాస్త నీట్‌గా రెడీగా అవుతారు సాధారణ జనం. అదే వీధి చివరినున్న కిరాణ కొట్టుకో, లేదంటే కూరగాయల మార్కెట్‌కో వెళ్లాల్సినప్పుడు బాడీ కవర్ అయ్యేలా మామూలు డ్రెస్‌తోనే బయల్దేరతారు. ఇక ఇంట్లో ఉన్నప్పుడైతే ఏదో ట్రాక్, టీ షర్టు, కాస్త పెద్ద వాళ్లయితే లుంగీ, బనియన్ ఇలాంటి బట్టలతోనే ఉంటారు మామూలు మన లాంటివాళ్లు. అయితే కేవలం బాత్రూమ్ కి వెళ్లేటప్పుడు కట్టుకునే టవల్‌తోనే కాలేజీకి వెళ్తున్నాడు ఓ కుర్రాడు. కాలేజీ వెళ్లే యువకులు ఎవరైనా.. ప్యాంటు, షర్టు, లోదుస్తులు, చేతి రుమాలు వంటి వాటితో బయల్దేరతారు. ఇతనికి మాత్రం అవేమీ అక్కర్లేదు. ఒక్క అండర్‌వేర్‌, టవల్ ఉంటే చాలు. మధ్యప్రదేశ్‌లోని బడ్‌వానీకి చెందిన కన్నయ్య అనే కుర్రాడికి చిన్నప్పటి నుంచి బట్టలు అంటే మహా చిరాకు. ఎవరైనా చొక్కా, ప్యాంటు వేసుకోమని చెబితే.. వారితో మాట్లాడడం కూడా మానేసేవాడట. చిన్నప్పుడు తల్లిదండ్రులు నచ్చజెప్పినా వినిపించుకోలేదట.

మొత్తానికి అలానే బడికి వెళ్తూ ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ఆపై చదువుల కోసం బడ్‌వానీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కన్నయ్యను చేర్పించేందుకు వెళితే.. యాజమాన్యం ప్రవేశం కల్పించలేదు. చివరకు కలెక్టర్‌ అనుమతి తీసుకున్న తర్వాతే.. ప్రవేశం లభించింది. ఇక పదవ తరగతి తర్వాత కాలేజీకి వెళ్లాలంటే కచ్చితంగా బట్టలు వేసుకోవాల్సి వస్తుందేమోనని భయపడ్డాడు. ఆందోళన చెంది.. పదో తరగతి తర్వాత చదువు ఆపేస్తానని చెప్పాడు. చదువులో చాలా చురుగ్గా ఉండే విద్యార్థి కావడం వల్ల టీచర్లు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత చాలా శ్రమపడి ఓ కాలేజీలో చేర్పించారు. ప్రస్తుతం కన్నయ్య ఇంటర్‌ చదువుతున్నాడు. ఇప్పటికీ ఓ అండర్‌వేర్‌, పైనుంచి తువ్వాలు తప్ప ఒంటిపై ఇంకేమీ ధరించడు.