బుడ్డోళ్లు బోరుబావుల్లో పడిపోయిన సంఘటనలు చాలావరకు విషాదంతో ముగుస్తుంటాయి. బోర్లకు మూతలు పెట్టకపోవడమే దీనికి ప్రధాన కారణం. కొన్నిచోట్ల మూతలు ఉన్నా దుకుడుతనంతో పిల్లోళ్లు లోపల పడిపోతుంటారు. ఓ చిన్నోడు కూడా అల్లాటప్పాగా బావి మూతపై ఎగిరి దబ్బున లోపల పడిపోయాడు. 40 అడుగుల లోతున్న బావిలో పడ్డా పెద్దోళ్లు చాకచక్యంగా వ్యవహరించడంతో మూడంటే మూడే నిమిషాల్లో ప్రాణాలతో నిక్షేపంగా బయటపడ్డాడు.
घर के आंगन में अगर कुआं या टंकी बनी हुई है तो इस वीडियो को जरूर देखें।#damoh #MadhyaPradesh pic.twitter.com/ntVMBiWgqE
— Makarand Kale (@makarandkale) December 21, 2022
మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో సోమవారం ఈ సంఘటన జరిగింది. వపన్ జైన్ అనే వ్యక్తి ఇంట్లోని బావి మూతపైకి వెళ్లిన ఓ బాలుడు హఠాత్తుగా అందులో పడిపోయాడు. అదృష్టవశాత్తూ అక్కడే ఆడుకుంటున్న వాడి స్నేహితుడు, తన ఫ్రెండు ఏమైపోయాడని బావిలోకి తొంగి చూసి, బిగ్గరగా అరుస్తూ పెద్దలను అప్రమత్తం చేశాడు. ఇంట్లోవాళ్లు వెంటనే అక్కడికొచ్చారు. పవన్ జైన్ తాడు సాయంతో లోపలికి దిగి, పడిపోయిన బాలుడిని బయటికి తీసుకొచ్చాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. బావిలపై మూతను లాక్ చేయకపోవడం పిల్లోడు పడిపోయాడని, ఇకపై జాగ్రత్తగా ఉంటామని పెద్దలు చెప్పారు.