ఎమ్మెల్యేపై రేప్ కేసు.. 10 కోట్లు కావాలంటోందట.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యేపై రేప్ కేసు.. 10 కోట్లు కావాలంటోందట..

November 21, 2022

మధ్యప్రదేశ్ పోలీసులకు పెద్ద చిక్కొచ్చి పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘార్ కేసును తేల్చలేక తల పట్టుకుంటున్నారు. ఉమాంగ్ తనపై అత్యాచారం చేసి, వేధింపులకు పాల్పడుతున్నాడని 38 ఏళ్ల మహిళ ఒకరు కేసు పెట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతడు తన భర్తేనని, అతనిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ట్విస్టు ఇవ్వడంతో అసలేం జరిగిందో అర్థం కావడం లేదు. గంధ్వానీ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమాంగ్‌కు ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అతనితో తాను ‘భార్య’ హోదాలో సంసారం చేస్తున్నానని భార్య అంటోంది. అతడు కూడా ఆమెతో సంబంధమున్నట్లు పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు. ఆమెతో వేగలేకపోతున్నానని, తనను వేధిస్తోందని, రూ. 10 కోట్ల డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తోందని అంటున్నాడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉమాంగ్ కేసులో చిక్కుకోవడంతో కాంగ్రెస్ నేతలు కూడా జవాబు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు.

పెళ్లి చేసుకుంటానని కోరిక తీర్చుకుని ముఖం చాటేశాడన్నది బాధితురాలి ఆరోపణ. ఈ ఏడాది ఏప్రిల్లో పెళ్లి చేసుకున్నామని, అయితే అతడు తరచూ తనపై అత్యాచారాలకు, అహజ శృంగారానికి పాల్పడుతున్నాడని ఆమె అంటోంది. ఉమాంగ్ ఇదివరకు కూడా సోనియా భరద్వాజ్‌ అనే మహిళలతో కలసి ఉన్నాడని, ఆమె ఆత్మహత్యకు అతడే కారణమని అంటోంది. ఆదివాసీ అయిన ఉమాంగ్ గతంలో రాష్ట్ర అటవీమంత్రిగా పనిచేశాడు.