మందు తాగండి.. ఓటు వేయండి.. ఎక్సైజ్ శాఖ - MicTv.in - Telugu News
mictv telugu

మందు తాగండి.. ఓటు వేయండి.. ఎక్సైజ్ శాఖ

October 21, 2018

మధ్యప్రదేశ్‌లోని అధికారులు ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. కానీ అది కాస్తా బెడిసి కొట్టడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లను చైతన్య పరిచేందుకు, ఓట్ల శాతాన్ని పెంచేందుకు ఝాబువా జిల్లాలోని కొందరు అధికారులు వైన్ షాపులోని మద్యం సీసాలపై ఓటర్లను చైతన్యం చేసేలా నినాదాలతో ఉన్న స్టిక్కర్లను అతికించాలని నిర్ణయించారు. కొన్ని స్టిక్కర్లను స్థానికంగా ఉన్న మద్యం దుకాణల్లో పంపిణీ చేశారు.Madhya Pradesh Elections Jhabua Administration Wants Stickers On Liquor Bottles To Sensitize Voters.. Drops Planఆ స్టిక్కర్లపై ‘ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించాలి’ అని రాశారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో మద్యం సరఫరా కాకుండా చూడాల్సిన అధికారులే ఇలా మద్యం బాటిళ్ళపై స్టిక్కర్లు ఏంటని మండిపడుతున్నారు. దీంతో అధికారులు వారి నిర్ణయాన్నివెనక్కి తీసుకున్నారు.

‘ ఓటర్లను చైతన్య పరిచే చర్యలో భాగంగా జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నాం. అన్నిఅంశాలను పరిశీలించిన తర్వాతనే దీన్ని వెనక్కితీసుకుంటున్నాం’ అని అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ అభిషేక్‌ తివారి పేర్కొన్నారు. కాగా మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ 28న ఒకే దశలో జరగనున్నాయి. డిసెంబర్‌ 11న ఫలితాలు వెల్లడికానున్నాయి.