శ్రామిక్ రైల్ లో పుట్టిన బిడ్డ..పేరేంటంటే! - MicTv.in - Telugu News
mictv telugu

శ్రామిక్ రైల్ లో పుట్టిన బిడ్డ..పేరేంటంటే!

May 24, 2020

papa

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్, శానిటైజేర్, మాస్క్, క్వారంటైన్ మొదలగు పదాలు తరచూ వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ కాలంలో ఈ పదాలు అనని వారు ఉండరంటే అతియోశక్తి కాదు. అంతలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. దీంతో ఈ లాక్ డౌన్ కాలంలో పుట్టే పిల్లలకు కొందరు వీటిని పేర్లుగా పెడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. 

ముంబైలో ఉంటున్న ఉదయ భాన్ సింగ్, రీనా దంపతులు శ్రామిక్ స్పెషల్ రైలులో ఉత్తరప్రదేశ్ లోని స్వగ్రామానికి బయలుదేరారు. శుక్రవారం రాత్రి సమయంలో నెలలు నిండిన రీనాకు పురిటి నొప్పులు ప్రారంభం కాగా, సాయం చేయాలంటూ ఉదయభాన్ సింగ్, రైల్వే హెల్ప్ లైన్ కు ఫోన్ చేశారు. వారు వెంటనే స్పందించి రైలును బుర్హాన్ పూర్ లో ఆపారు. అక్కడినుంచి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. లాక్ డౌన్ సమయంలో పుట్టినందున అతనికి ‘లాక్ డౌన్ యాదవ్’ అని పేరు పెట్టారు.