ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు - MicTv.in - Telugu News
mictv telugu

ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు

May 20, 2019

Madhya Pradesh Government In Minority, Says BJP In Letter To Governor.

ఆదివారం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. తదనంతరం వివిధ వార్త చానళ్ళు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మళ్ళీ ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారం చేజిక్కించు కోవడానికి వ్యూహరచన చేస్తుంది.

మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే కమల్ నాథ్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బలనిరూపణ చేయాలనీ కోరింది. ఇప్పటికే మాయావతి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుందని బీజేపీ నేతలు గవర్నర్‌కు తెలియజేశారు. 2018 లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 113 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ పార్టీ 109 స్థానాలతో సరిపెట్టుకుంది. ఎవ్వరికీ సరిపడా మెజారిటీ రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు చేసింది.