తెగించేశాడు.. ఒంటరిగా వెళ్లి, వధువును తెచ్చుకున్నాడు..
లాక్‌డౌన్ కొత్త జంటలకు చిక్కులు తెచ్చిపెడుతోంది. వివాహాలు జరగడానికి ఇబ్బందిగా మారడంతో చాలా మంది వాయిదా వేసుకుంటున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన భాగస్వామిని తెచ్చుకునేందుకు ఏకంగా బైక్ వేసుకెళ్లి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. పెళ్లి కొడుకు దుస్తుల్లో ఒంటరిగా వెళ్లి జంటగా ఇంటికి తిరిగి వచ్చాడు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఇది జరిగింది.
నౌగావ్‌లో నివసిస్తున్న సునీల్ అహిర్‌వార్‌కు ఏప్రిల్ 28 న వివాహం నిర్ణయించారు. కానీ లాక్‌డౌన్ విధించడంతో పెద్దలు పెళ్లిని వాయిదా వేశారు. ఇది ఏమాత్రం ఇష్టం లేని ఆ యువకుడు ఎలాగైనా తన భాగస్వామిని తీసుకువచ్చుకోవాలని అనుకున్నాడు. జరగాల్సి ఉంది. బైక్ పై వధువు ఇంటికి వెళ్ళాడు. అతనిని చూసి అత్తామామలు ముందు ఆశ్చర్యపోయినా చివరకు అతనితో ఆమె పంపారు. అలా బైక్‌పై వస్తున్న వీరిని పోలీసులు ఆపినా అసలు విషయం చెప్పి తీరా ఇళ్లు చేరుకున్నాడు. సునిల్ చేసిన పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు.