‘ద కశ్మీర్ ఫైల్స్’ ఎఫెక్ట్.. ఐఏఎస్‌కు షోకాజ్ నోటీస్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ద కశ్మీర్ ఫైల్స్’ ఎఫెక్ట్.. ఐఏఎస్‌కు షోకాజ్ నోటీస్

March 23, 2022

bfbfd

ఇటీవల విడుదలయి బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. కశ్మీర్‌లో పండిట్లపై జరిగిన ఆకృత్యాల ఆధారంగా వచ్చిన ఈ సినిమా రాజకీయంగా చిన్న దుమారాన్నే రేపింది. అయితే ఈ సినిమా వల్ల ఓ ఐఏఎస్ అధికారి ఇరుకున పడ్డాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన నియాజ్ ఖాన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఈ సినిమాపై ట్విట్టర్‌లో వరుస కామెంట్లు పెట్టాడు. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని, చిత్ర నిర్మాతను టార్గెట్ చేస్తూ.. ఇతర రాష్ట్రాల్లో ముస్లింలపై జరిగిన దాడుల గురించి సినిమాలు తీయమంటూ సవాలు విసిరాడు. ఈ విషయం కాస్తా రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వ పెద్దలు నియాజ్ ఖాన్‌పై సీరియస్ అయ్యారు. దాంతో నియాజ్ ఖాన్‌కు షోకాజ్ నోటీసులు పంపుతామని మధ్యప్రదేశ్ హోం మంత్రి ప్రకటించారు. మరి నోటీసుకి నియాజ్ ఖాన్ ఏ విధంగా సమాధానం ఇస్తారో వేచి చూడాలి.

xgsv