ఓరి నాయనో ..సర్కారీ దవాఖానాల్లో జ్యోతిష్యం ఎందో..! - MicTv.in - Telugu News
mictv telugu

ఓరి నాయనో ..సర్కారీ దవాఖానాల్లో జ్యోతిష్యం ఎందో..!

July 17, 2017

ఎహె సర్కారీ దవాఖానాల్లో జ్యోతిష్యం ఏంటీ అని ఆశ్చర్యపోవొద్దు..ఇది అక్షరాలా నిజం. జబ్బులతో బాధపడే వాళ్లు ఇక చేయి చూపించుకోవచ్చు.. మందులతో పాటు భవిష్యవాణి వినొచ్చు..మందులు , సూదులతో రోగాలు తగ్గిన, తగ్గకపోయినా…మనస్సు మాత్రం కుదుటపడొచ్చు..ఎందుకంటే జ్యోతిష్యం పేరిట ఉన్నది లేనిది వింటారు కదా .అస్సలు సర్కారీ దవాఖానాల్లో జ్యోతిష్యం సేవలు ఎంది..?ఏ సీఎం పెట్టారు..?ఎక్కడ పెట్టారో తెలుసా…

ఆసుపత్రుల్లో జ్యోతిష్యం సేవలు మనదగ్గర కాదులే..మధ్యప్రదేశ్ లో. వివిధ రకాల జబ్బులతో బాధపడేవారు సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ దవాఖానాల్లోని ఓపీ విభాగంలో జ్యోతిష్యుల సేవలనూ పొందవచ్చు. జ్యోతిష్యం, వాస్తు, హస్తసాముద్రికం, వైదిక కర్మకాండలను సూచించేవారి సేవలను రోగులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రంగాల్లో నిపుణులతో ప్రత్యేకంగా ఆస్ట్రాలజీ ఔట్‌పేషెంట్ విభాగాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వీటి నిర్వహణను మహర్షి పతంజలి సంస్కృత సంస్థాన్ (ఎంపీఎస్‌ఎస్)కు అప్పగించనుంది. రోగులకు వారంలో రెండురోజులపాటు, రోజుకు నాలుగుంటలు జ్యోతిష్యుల సేవలు అందిస్తారు. రూ.5 చెల్లిస్తే చాలు.. రోగుల చేతుల్లోని రేఖలను, వారి జాతక చక్రాలను పరిశీలించి వీరు తగిన సలహాలు ఇస్తారు అని ఎంపీఎస్‌ఎస్ తెలిపింది.

మధ్యప్రదేశ్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. సర్కారీ దవాఖానాల్లో జ్యోతిష్యం ఏంటనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీడ్ యుగంలో కూడా వీటిని నమ్ముతారా అని ప్రశ్నిస్తున్నారు. జ్యోతిష్యం మూఢనమ్మకం అని అంటున్నారు. శాస్త్రం కానే కాదు.. మరి ఎందుకు సర్కారీ దవాఖానాల్లో వీటి సేవలు అందిస్తున్నారు..?

వ్యక్తగతంగా ఎవరి నమ్మకాలు వారివి..కొందరు ముహూర్తం చూడనిదే పని మొదలెట్టారు..మరికొందరు ముహూర్తాల్ని అసలు పట్టించుకోరు. కానీ ఓ రాష్ట్ర సర్కారే మూఢ నమ్మకమైనా జ్యోతిష్యం సేవలు అందించడం ఏంటీ? ఎంత బీజేపీ సర్కారైనా ఇలా చేయడం ఎంతవరకు సమంజసం..? ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన సర్కారోళ్లు ఇలా చేయడం ఎందో…

నేతలు, సాంకేతిక నిపుణులు, పవిత్ర గ్రంథాలను పట్టుకొని, పూజలు చేస్తున్నారు. ప్రొఫెసర్లు, సాధువు ఏం చెప్పినా, ఇంటిలో విగ్రహారాధన, బయట మొక్కులు తీర్చుకుంటున్నారు.సమాజంలో ఓ హోదాలో ఉన్నవారు సైతం దేవుళ్ల సేవలో మునిగితేలుతున్నారు. ప్రతి క్షణం జ్యోతిష్యాన్ని పాటిస్తున్నారు. కొందరు కొన్నింటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి మరికొన్నింటిని గుడ్డిగా నమ్ముతున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ ప్రభుత్వమే జ్యోతిష్యాన్ని నమ్మి…సర్కారీ ఆసుపత్రుల్లో సేవలు అందిస్తే ఇంకేమన్నా ఉందా…?