కూలీకి సుశాంత్ అభిమానుల ఫోన్ కాల్స్..ఎందుకంటే? - MicTv.in - Telugu News
mictv telugu

కూలీకి సుశాంత్ అభిమానుల ఫోన్ కాల్స్..ఎందుకంటే?

July 7, 2020

Labourer

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇటీవల ముంబైలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ విషయాన్ని ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే సుశాంత్ ను తలచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

ఇదిలా ఉంటే కొందరు సుశాంత్ అభిమానులు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని ఇండోర్ నగరానికి చెందిన ఓ కూలికి విపరీతంగా ఫోన్ కాల్స్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. క్ష‌ణం తీరిక లేకుండా ఆ కూలికి సుశాంత్ అభిమానుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అందరికి ఇది రంగ్ నంబర్ అని చెప్పలేక అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయమై పోలీసులు విచారణ చేపట్టగా సుశాంత్ మాజీ ప్రేయ‌సి అంకితా లోఖండే పేరుతో ఎవ‌రో గుర్తు తెలియ‌న వ్య‌క్తులు ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేశారని తేలింది. అందులో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌కు చెందిన‌ ఓ కూలీ నెంబ‌ర్‌ను ఉంచారు. ఇది నిజ‌మైన అకౌంట్ అని న‌మ్మిన ఎంతో మంది సుశాంత్ అభిమానులు ఆ ఫోన్ నంబర్ కి ఫోన్ చేస్తున్నారు. ఈ ఫేక్ అకౌంట్‌ను 40 వేల మంది ఫాలో అవుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇక ఆ అకౌంట్‌ను న‌డుపుతున్న‌ వ్య‌క్తిని ప‌ట్టుకునే ప‌నిలో పోలీసులు ఉన్నారు.