చిల్లర బండి.. 83 వేల స్కూటర్‌ను నాణేలతో కొనేశాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

చిల్లర బండి.. 83 వేల స్కూటర్‌ను నాణేలతో కొనేశాడు.. 

October 27, 2019

coin......

ఎంత పెద్ద ప్రయాణమైనా మొదటి అడుగుతోనే మొదలవుతుంది. ఎన్ని కోట్లకోట్ల డబ్బయినా తొలి రూపాయి లెక్కతోనే మొదలవుతుంది. పైసాపైసా కూడబెట్టి కోట్లకు పడగలెత్తిన కుబేరులు మన చుట్టూనే ఉంటారు. అందుకే చిల్లర శ్రీమహాలక్ష్మి అంటారు. మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన రాకేశ్ కుమార్ గుప్తాకు ఈ నిజం బాగా తెలుసు. ఏళ్ల తరబడి చిల్లర పైసలు కూడబెట్టి కూడబెట్టి దీపావళి సందర్భంగా మాంచి బండి కొనేశాడు. 

coin......

రూ. 83 వేల విలువైన హోండా యాక్టివా 125సీసీ స్కూటర్‌ను అతడు కేవలం చిల్లర పైసలతో కొనేశాడు. స్కూటర్ కొనడానికి డబ్బు తెచ్చానని, సిబ్బంది కాస్త సాయం పడితే లోనికి తీసుకొస్తానని అతడు చెప్పడంతో షోరూం ఉద్యోగులు షాక్ తిన్నారు. ఎన్ని కట్టల డబ్బు తెస్తున్నావని సరదగా అడిగారు. అతడు విషయం చెప్పడంతో విధిలేక నవ్వుతూ లెక్కింపు పర్వానికి తెరతీశారు. మూడు గంటలపాటు ఆ చిల్లర లెక్కించి అతనికి బండి అందజేశారు. రాకేశ్ తెచ్చిన చిల్లరలో అత్యధికం రూ. 5, రూ. 10 నాణేలు ఉన్నాయి. అర్ధరూపాయలు కూడ బాగానే లెక్క తేలాయి. ఎందుకిలా చేశావని అడగ్గా, ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదని, అదంతా దాచుకున్న డబ్బు అని అతడు చెప్పాడు.