Madhya Pradesh man chops transgender into two pieces; keeps one piece at home
mictv telugu

భార్య పుట్టింటికి వెళ్లగానే.. కక్కుర్తితో ట్రాన్స్‌జెండర్‌ను పిలిచి..

September 1, 2022

భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ఓ భర్త చేసిన దారుణంపై మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పొదలమాటున సగం వరకు నరికి ఉన్న ఓ ట్రాన్స్‌జెండర్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ముందు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని… విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ లభించడంతో దర్యాప్తులో మిస్టరీ వీడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇండోర్ నగరంలోని ఖజ్రానా ప్రాంతానికి చెందిన నూర్ మహ్మద్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో జోయా కిన్నర్‌ అనే ఆమెతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా మాట్లాడాడు.

తన భార్య ఇంట్లో లేదని, ఏకాంతంగా గడుపుదామని జోయాను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు మహ్మద్. ఇంటికి వచ్చిన జోయా ట్రాన్స్‌జెండర్ అని తెలుసుకొని షాక్ అయ్యాడు. ఈ విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మహ్మద్ జోయాను గొంతుకోసి చంపాడని ఇండోర్ పోలీసులు తెలిపారు.‘‘నిందితుడు నూర్ మహ్మద్ ట్రాన్స్‌జెండర్ జోయా మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి, ఒక ముక్కను గోనె సంచిలో నింపి బైపాస్‌రోడ్డుకు సమీపంలోని పొదల్లోకి విసిరాడు. మరో భాగాన్ని పారేయలేక తన ఇంట్లోని పెట్టెలో దాచిపెట్టాడు. నూర్ మహ్మద్ ఇంటి నుంచి జోయా మృతదేహం మిగిలిన సగభాగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నూర్ మహ్మద్ పై హత్య కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సంపత్ ఉపాధ్యాయ చెప్పారు. ఆగస్టు 28 నుంచి కనిపించకుండా పోయిన ట్రాన్స్‌జెండర్ జోయా మృతదేహం సగ భాగం ఇండోర్‌లోని స్కీమ్ నంబర్ 134 ప్రాంతంలో పోలీసులకు దొరికింది.