చనిపోయాడనుకున్న కొడుకును తిరిగి రప్పించిన లాక్‌డౌన్ - MicTv.in - Telugu News
mictv telugu

చనిపోయాడనుకున్న కొడుకును తిరిగి రప్పించిన లాక్‌డౌన్

May 15, 2020

Madhya Pradesh Man Come Returnin lock down After Missing

చనిపోయాడని అనుకొని అంత్యక్రియలు కూడా చేసిన కొడుకు లాక్‌డౌన్ కారణంగా తిరిగొచ్చాడు. అతడిని చూసి ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఇంత కాలం ఎక్కడనున్నావంటూ ఆరా తీశారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లా దిల్వారీ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తిరిగొచ్చిన కొడుకును చూసి ఆ తల్లి సంబరపడిపోతోంది. 

ఉదయ్‌ అనే వ్యక్తి 2017 నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అతని కోసం మిస్సింగ్ కేసు కూడా పెట్టారు. కొన్ని రోజులకు అతడు మరణించాడంటూ ఓ శవాన్ని చూపించడంతో తమ కొడుకే అని నమ్మి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. తీరా మూడేళ్ల తర్వాత అతడు తిరిగి రావడంతో జరిగిన విషయం తెలుసుకొని అంతా ఆశ్చర్యపోయారు. తనపై గతంలో కొంత మంది దొంగతనం కేసు పెడతామని బెధిరించారని అందుకే భయపడి పారిపోయినట్టుగా వెల్లడించారు. ఇంత కాలం పాటు ఢిల్లీలో ఉంటూ పని చేసుకున్నానని, లాక్‌డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో ధైర్యం చేసి ఇంటికి వచ్చానని చెప్పాడు. మొత్తానికి లాక్‌డౌన్ తల్లి కొడుకులను కలపడటంతో స్థానికంగా ఇదే చర్చనీయాంశంగా మారింది.