Madhya Pradesh man set on fire for flashing private parts
mictv telugu

పురుషాంగం చూపిస్తున్నాడని కాల్చేశారు..

August 8, 2022

కొందరికి ఏ అవయవాలు ఎందుకున్నాయో అర్థం కాదు ముందు కూర్చున్న వాళ్లను కాళ్లతో గోకే వాడు ఒకడైతే, బస్సులో కుదుపుల పేరుతో అమ్మాయిలపై తూలిపోయే పోకిరీ మరొకడు. దైవదర్శనం పేరుతో అమ్మాయిల దర్శనం కోసం కళ్లింతలు చేసుకుని వచ్చేవాడు మరొకడు. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా కజ్లీ గ్రామంలో అలాంటి తలతిక్క సంఘటన ఒకటి చోటుచేసుకుంది. దీప్‌చంద్ అనే వ్యక్తి తరచూ గ్రామ మహిళల ముందు నగ్నంగా నిలబడి తన జననాంగాన్ని వారికి చూపించేవాడు. అది పద్ధతి కాదని, ఇంటికెళ్లి పనిచేసుకోపో అని స్థానికులు మందలించేవారు. అతడు వారి మాట వినకపోగా మళ్లీ మళ్లీ న్యూడ్ ఎగ్జిబిషన్‌కు పాల్పడుతూ అసభ్య చేష్టలు చేసేవారు.

దీంతో జనం విసిగిపోయారు. సుదేష్, కృష్ణ అనే యువకులు ఆదివారం అతణ్ని పట్టుకుని ప్రైవేట్ పార్టుపై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. దీప్‌చంద్ లబోదిబోమంటూ కేకలు వేశాడు. అతని బాధ చూడలేక స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పురుషాంగం 20 శాతం కాలిపోయిందని, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. నిప్పు పెట్టిన యువకులను పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టారు.