Madhya Pradesh Minister Removes Kurta, Washes Himself At BJP Event. Reason Is.
mictv telugu

మంత్రికి దురదలు…రోడ్డుపైనే చొక్కా తీసేసి.. (వీడియో)

February 10, 2023

Madhya Pradesh Minister Removes Kurta, Washes Himself At BJP Event. Reason Is.

మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి బ్రజేంద్రసింగ్ యాదవ్ కు ఊహించని అనుభవం ఎదురైంది. అనుకోని కష్టం ఆయన చేత నడ్డిరోడ్డుపై బట్టలను తీయించేసేంది. బీజేపీ చేపట్టిన వికాస్ రథయాత్రలో భాగంగా ముంగవోలిలోని ఓ గ్రామం మీదుగా బ్రజేంద్రసింగ్ యాదవ్ వెళ్తున్నారు. తరలివచ్చిన పార్టీ శ్రేణులకు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతనిపై దురద పౌడర్ జల్లాడు. దీంతో ఒక్కసారిగా తీవ్ర దురదలతో అల్లాడిపోయాడు. ఇక చేసేది ఏంలేక రోడ్డుపైనే షర్ట్‎ను తీసివేశారు. నీళ్లతో శరీరాన్ని కడుకుని ఉపశమనం పొందారు. దీంతో వికాస్ రథయాత్ర ఊహించని రీతిలో చివరికి నిలిచిపోయింది. ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అవి వైరల్‎గా మారాయి.