ద్యావుడా..మంత్రికి మాస్కులు మాలతో స్వాగతం - MicTv.in - Telugu News
mictv telugu

ద్యావుడా..మంత్రికి మాస్కులు మాలతో స్వాగతం

July 11, 2020

Madhya pradesh minister welcomed with mask garlan

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కులకు, శానిటైజర్లకు ప్రాముఖ్య పెరిగిన సంగతి తెల్సిందే. దీంతో ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మంత్రి ప్రద్యుమాన్ సింగ్ తోమర్ తొలిసారిగా గ్వాలియర్ పర్యటనకు వచ్చారు.

ఈ సందర్భంగా అక్కడి బీజేపీ కార్యకర్తలు అతనికి మాస్క్ మాలతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో మంత్రి అక్కడికి వచ్చిన ప్రజలకు మాస్క్‌లను, శానిటైజర్లను పంపిణీ చేశారు. తరువాత దివంగత మాధవరావు సింధియా విగ్రహానికి పూలమాల వేశారు. మంత్రి వస్తున్నారని తెలిసి కొంతమంది తల్లిదండ్రులు… విద్యార్థుల ఫీజుల విషయంలో ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న ఒత్తిడిపై ఆయనకి ఫిర్యాదు చేశారు. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక పరిస్థితులు బాగాలేవని ఇటువంటి పరిస్థితిలో పిల్లల స్కూలు ఫీజుల కట్టలేమని మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.