క్యాషియర్‌ సమయస్ఫూర్తికి బ్యాంకు దొంగ పరుగోపరుగు - MicTv.in - Telugu News
mictv telugu

క్యాషియర్‌ సమయస్ఫూర్తికి బ్యాంకు దొంగ పరుగోపరుగు

February 19, 2020

Madhya pradesh narsimhapur district robbery

మధ్యప్రదేశ్‌లోని నిరసింహపూర్ జిల్లాలోని సెంట్రల్ బ్యాంకులో ఆసక్తికర సంఘటన జరిగింది. బ్యాంకులో దొంగతనం చేయడానికి వచ్చిన ఓ దొంగ.. క్యాషియర్ ప్రదర్శించిన సమయస్ఫూర్తికి అక్కడినుంచి పారిపోయాడు.

ఒక యువకుడు ముఖానికి ముసుగు వేసుకొని బ్యాంకులోకి ప్రవేశించాడు. తపంచా బయటకు తీసి, బ్యాంకులో ఉన్న వ్యక్తులను బెదిరించాడు. తరువాత క్యాష్‌కౌంటర్ దగ్గరికి వెళ్లి డబ్బులు ఇమ్మంటూ క్యాషియర్‌ను డిమాండ్ చేశాడు. దీంతో క్యాషియర్ తెలివిగా అక్కడే ఉన్న సైరన్ బటన్ నొక్కాడు. ఈ శబ్ధం వినగానే ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. అక్కడి సిబ్బందిని విచారించి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.