రంజీలో కొత్త చరిత్ర.. ఫైనల్లో ఓడిన ముంబై - MicTv.in - Telugu News
mictv telugu

రంజీలో కొత్త చరిత్ర.. ఫైనల్లో ఓడిన ముంబై

June 26, 2022

రంజీ ట్రోఫీ టోర్నమెంట్‌లో సంచలనం చోటుచేసుకుంది. ఫైనల్లో ముంబై జట్టును ఓడించి మధ్యప్రదేశ్ తొలిసారిగా ట్రోఫీ గెలుచుకుంది. 1998 – 99 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన మధ్యప్రదేశ్ ఈ సారి మాత్రం పట్టు విడువకుండా ట్రోఫీ సాధించింది. మొదటి నుంచి ఆధిపత్యం చెలాయించిన మధ్యప్రదేశ్ జట్టు ముంబై విసిరిన 108 పరుగుల లక్ష్యాన్ని వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ఛేదించింది. రంజీ ట్రోఫీ సాధించిన మధ్యప్రదేశ్ జట్టును బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైశా, మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసించారు.