Madhya Pradesh: Three brothers among five dead after inhaling toxic gas inside well; one injured
mictv telugu

బావిని శుభ్రం చేస్తూ ఐదుగురు మృతి.. వారిలో ముగ్గురు అన్నదమ్ములు

June 9, 2022

Three brothers among five dead after inhaling toxic gas inside

బావిని శుభ్రం చేసేందుకు అందులోకి దిగిన ఐదుగురు వ్యక్తులు విషవాయువుల కారణంగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా కుదాన్ గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. మృతుల్లో ముగ్గురు అన్నదమ్ములుగా గుర్తించారు అధికారులు. బుధవారం మధ్యాహ్నం బావిలోకి మొదట ఇద్దరు వ్యక్తులు దిగారు. లోపల ఉన్న విషవాయువుల కారణంగా వారు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఎంతసేపైనా ఆ ఇద్దరూ పైకి రాకపోవడం వల్ల ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆ బావి యజమానితోపాటు మరో ముగ్గురు లోపలికి వెళ్లారు. వీరిలో ముగ్గురు విషవాయువుల ధాటికి చనిపోయారు. నాల్గవ వ్యక్తి పాలక్ కుర్చాందీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పాలక్‌ను ఆసుపత్రికి తరలించారు.
మృతులు పునీత్ కుర్చాందీ (32), పన్ను కుర్చాందీ (30) మన్ను కుర్చాందీ (27) తేజ్లాల్ మర్కమ్ (32), తమేశ్వర్ బిల్సారేలుగా (20) అధికారులుగా గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్.. తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు రూ.20వేలను అందించనున్నట్లు ప్రకటించారు.