16వ బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూత..  - MicTv.in - Telugu News
mictv telugu

16వ బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూత.. 

October 12, 2020

gnbfgnb

కుటుంబ నియంత్రణ పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా కొంత మంది పట్టించుకోవడం లేదు. వరుసగా పిల్లలను కంటూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోనూ విషాదం చోటు చేసుకుంది. 16వ బిడ్డకు జన్మనిస్తున్న సమయంలో ప్రసవం జరుగుతుండగానే మహిళ కన్నుమూసింది. దామోహ్‌ జిల్లాలో ఇది జరిగింది. కొంత సేపటికే పుట్టిన బిడ్డ కూడా మరణించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 

సుఖ్రాని అహిర్వర్‌ అనే మహిళ 16వ సారి గర్భం దాల్చింది. రెండు రోజుల క్రితం  నొప్పులు రావడంతో స్థానికంగా ఉండే ఆశా కార్యకర్త బాయి విశ్వకర్మ సుఖ్రానికి డెలివరీ చేసింది. మగ బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో చనిపోయింది. అప్పటికే ఆ శిశువు పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో  కొంత మంది చనిపోయారు. సుఖ్రాని గతంలో 15 మంది పిల్లలకు జన్మనిచ్చింది. కానీ వారిలో ఏడుగురు చనిపోయారు. అయినా కూడా వరుసగా పిల్లలను కంటూనే ఉన్నారు.