మహా మలబద్ధకం! 18 నెలలుగా టాయిలెట్‌కు వెళ్లడం లేదు - MicTv.in - Telugu News
mictv telugu

మహా మలబద్ధకం! 18 నెలలుగా టాయిలెట్‌కు వెళ్లడం లేదు

November 23, 2020

కడుపులో గడబిడ కామనే. కొన్నిసార్లు విరేచనాలు అవుతాయి. కొన్నిసార్లు మలబద్దకం కూడా ఎదుర్కొంటాం. మెడికల్ షాపుకు వెళ్లి టాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంటాం. సమస్య తీవ్రంగా ఉంటే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటాం. కానీ మలబద్దం నెలల తరబడి కొనసాగుతుంటే? ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ఏకంగా 18 నెలలుగా మలమూత్రాలే రాకపోతే! తిన్నదంతా కడుపులో ఎక్కడిపోతుందో తెలియకపోతే? 

మధ్యప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల కుర్రవాడు ఈ సమస్య ఎదుర్కొంటున్నాడు. అతని జబ్బేమిటో తెలియక డాక్టర్లు కూడా తలబాదుకుంటున్నారు. 

మురౌనా జిల్లాలో చెందిన ఆశిష్ చాండిల్  ఏడాదిన్నరగా టాయిలెట్‌కు వెళ్లడం లేదు. అయినా చక్కని ఆరోగ్యంతో ఉన్నాడు. ఆడుకుంటున్నాడు, పాడుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు. అంతే కాదండోయ్.. మామూలు తిండికంటే ఎక్కువే తింటున్నాడు. ఎక్కువ తిండి తినిపిస్తే లోపలిది బయటికి వస్తుందన్న ఆశతో తల్లి అతనికి రోజుకు 20 రొట్టెలు తినిపిస్తోంది. లీటర్ల కొద్దీ నీళ్లు తాగిస్తోంది. కడుపు పగిపోయేలా తిని తాగుతున్నా అతనికి మలమూత్రాలు రావడం ముక్కి మూలిగినా రావడం లేదు. 

ఆశిష్‌ను తల్లిదండ్రులు  డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లారు. వారు అన్ని టెస్టులూ చేసి… ‘మీ కుర్రాడు నిక్షేపంగా ఉన్నాడు..’ అని తేల్చేశారు. అయినా వారి తృప్తి కోసం ట్యాబ్లెట్స్, టానిక్స్ రాసిచ్చారు. వాటితోనూ ఫలితం లేకపోయింది. ఇలాంటి వింత వ్యాధిని తమ కెరీర్‌లో ఎప్పుడూ చూడలేదని డాక్టర్లు నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఆశిష్ రక్త నమూనాలను, ఇతర ఆరోగ్య పరీక్షలను నిర్వహించిన వైద్యులు ఫలితాలను విశ్లేషించడానికి నానా తంటాలు పడుతున్నారు. గతంలో ఇలాంటి కేసులకు చేసిన చికిత్స వివరాలను బయటికి తీస్తున్నారు.  వినడానికే వింతగా ఉన్న జబ్బు నుంచి ఆశిష్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.