కోటిరూపాయలను తిరస్కరించింది..ఆమె ఎవరు ? - MicTv.in - Telugu News
mictv telugu

కోటిరూపాయలను తిరస్కరించింది..ఆమె ఎవరు ?

June 12, 2017


బతికున్నప్పుడు బువ్వ పెట్టను కాని సచ్చిన తర్వాత స్వర్గం చూపిస్తా అన్నాడట ఎన్కటికి వీళ్ళసొంటి పుణ్యాత్ములె(మధ్యప్రదేశ్ సర్కార్),చేతిలో చిల్లిగవ్వలేక సర్కారు నుంచి అప్పు తీస్కోని కష్టపడి దుక్కి దున్ని చెమటోడ్చి పంటను పండిస్తే… పండించిన పంటకు గిట్టుబాటుధరలేక అప్పులపాలై ఏం చెయ్యాలో ఏం తినాలో తెలియక ,మామీద దయతలిచి మీరిచ్చిన అప్పును మాఫీ చెయ్యండి అని సర్కారును వేడుకుంటూ రోడ్డెక్కిన రైతుకు…కట్టెలతో కొట్టి.. తిట్టి ఆఖర్కి పిట్టల్లా ఐదుగురిని పొట్టన పెట్టుకున్న మధ్యప్రదేశ్ సర్కార్,
ఇపుడేమో చనిపోయిన ఒక్కొక్కరికి కోటిరూపాయలు ఇస్తామని చెప్పింది,దానికి ఓ రైతు భార్య చెప్పిన సమాధానం వింటే మన మనసు చలించక మానదు,మధ్యప్రదేశ్ సర్కారోళ్లు సిగ్గుతో తలవంచకోక మానరు.ఆమె ఏం చెప్పిందంటే మా భర్తల ప్రాణాలకు బదులుగా కోటిరూపాయలు ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది,నేనే సర్కారోళ్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్న చనిపోయిన నాభర్తను తీసుకురండి నేనే మీకు పది కోట్ల రూపాయలు ఇస్తా అని మధ్యప్రదేశ్ సర్కార్ కు సవాల్ విసిరింది.

నిజమే ఎన్ని పైసలున్న ఏం ఫాయిదా అవి మనిషి పంచినట్టు ప్రేమను పంచుతయా,మనిషి లేని లోటు తీరుస్తయా,కష్టాలు బాధలు వచ్చినపుడు ఓదారుస్తాయా,ఇప్పుడిస్తా అంటున్న గ కోటేదో వాళ్లు ధర్నాలు జెయ్యకముందే రుణమాఫీ జేస్తే ఈరోజు ఇన్ని కుటుంబాలు ఆగం కాకపోతుండె గదా,దేశంలో మనందరికి అన్నంపెట్టే రైతు పరిస్దితి ఇది,రైతే రాజు సంగతి దేవుడెరుగు కనీసం..మన కడుపునింపుతున్న రైతన్నల గుండెలు మండెలా చెయ్యకండి.ఓట్లకోసం మీరచ్చి మమ్మల్ని గెలిపిస్తే రుణమాఫీ చేస్తాం అని మీరే చెప్పారు..మరి ఇప్పుడేమైంది..మీ మాటలు నీళ్లమీద రాతలేనా
అయినా తప్పంతా రైతుదే ఎందుకంటే మోసపోవడం అలవాటు చేసుకున్నారే తప్ప మోసం చెయ్యడం నేర్చుకోలేదు,రుణమాఫీ చెయ్యకపోతే రోడ్డెక్కుడు ధర్నాలు చేసుడు నేర్చుకున్నారే తప్ప…కోట్లు ముంచి విదేశాలలో దర్జాగా బతకడం నేర్చుకోలేకపోయారు.ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఈజన్మలో రైతులుగా పుట్టాం అనే భావన రైతుల్లో రాకముందే మేల్కొనండి,ఎందుకంటే రైతు లేక పోతే మనకు తిండిలేదు, తిండిలేకపోతే అసలు మనిషేలేకుండైతడు. జై జవాన్…జైకిసాన్.